Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారంట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో చూసుకుంటే త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ పేర్లు ఉన్నాయి. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు. కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.
Read Also : Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ
ఇప్పుడు రుక్మిణీ వసంత్ పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని భావిస్తున్నారంట. పైగా హరిహర వీరమల్లు మూవీకి త్రివిక్రమ్ కొంత హెల్ప్ చేశారు. ఆ టైమ్ లోనే నిధితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందంట. నిధి అగర్వాల్ ఈ సినిమాలో పాత్రకు సెట్ అవుతుందని గురూజీ భావిస్తున్నారంట. అన్నీ కుదిరితే త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. అది పెద్ద హిట్ అయితే నిధికి అవకాశాలు పెరగడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Read Also : Dilraju : విజయ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి.. దిల్ రాజు కామెంట్స్..