SS Rajamouli Bags Newyork Film Critic Circle Best Director Award ఇండియన్ సినిమా గ్లోరీని వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమాని వెస్ట్ ఆడియన్స్ ఇంతలా మెచ్చుకుంటారా? ఒక ఇండియన్ డైరెక్టర్ ని హాలీవుడ్ లో ఇంత పేరోస్తుందా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్న రాజమౌళి ఖాతాలో మరో అవార్డ్ వచ్చి చేరింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) ‘బెస్ట్ డైరెక్టర్’ గా ‘రాజమౌళి’ పేరుని అనౌన్స్ చేసింది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘లాస్ ఏంజిల్స్’, ‘న్యూయార్క్’, ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావాలి. వీటిలో ఏ అసోసియేషన్ నుంచి అవార్డ్ రాబట్టినా, ఆ సినిమాకి ఆస్కార్ రేస్ లో జర్నీ పెరుగుతుంది. ఎక్కువ రెకమెండేషన్స్ వస్తాయి, ప్రమోషనల్ బూస్ట్ లభిస్తుంది, రీచ్ పెరుగుతుంది. ఇలా ఆస్కార్ రేస్ లో ఉన్న సినిమాకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక అవార్డ్ ని రాజమౌళి గెలుచుకోవడం చాలా గొప్ప విషయం.
వెస్ట్ ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న ‘ఇండియన్ సినిమా’ అంటే అది ‘ఆర్ ఆర్ ఆర్ సినిమా’నే. ఈ స్థాయిలో మన సినిమాని అక్కడి ఆడియన్స్ నెత్తినపెట్టుకోని చూసిన ధాకలాలు మన దగ్గర లేవు. ఆడియన్స్ సపోర్ట్ తో పాటు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండడం జక్కన్నకి కలిసొచ్చే విషయం. ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ, ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తూ జక్కన్న ఆస్కార్ ని ఇండియాకి తీసుకోని రావాలని ప్రతి సినీ అభిమాని కోరుకుంటున్నాడు. మరి ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.