New Year Celebrations at FNCC pn December 31st Night: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు సభ్యలు. ప్రతి ఏడాది లానే నిన్న రాత్రి అంటే డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన సంగీత విభావరి, బెలీ డాన్స్, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ వేడుకకు హాజరైన అహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొని 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు క్లబ్ సభ్యులు.
Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..
ఇక ఈ క్రమంలో సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ” గతంలో ఉన్న కమిటీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ను ఎంతో అభివృద్ధి చేసిందని, మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకెళతామని అన్నారు. దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం” అని మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎన్ సీ సీ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ బి రాజశేఖరరెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ , శైలజా జుజల, బాలరాజు, గోపాలరావు, ఏడిద రాజా మోహన్ వడ్లపట్ల, ఇంద్రపాల్‌రెడ్డి, వరప్రసాదరావు సహా క్లబ్ సభ్యులు అనేక మంది పాల్గొన్నారు.