Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్ కి.. ప్రశాంత్ నీల్ టేకింగ్కి ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే.. సలార్ సినిమా విడుదలకు ముందు అందరికీ ఇదే అనిపించింది. అన్నట్టుగానే సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్లో హోంబలే ఫిలింస్ ఆసక్తికరమైన అప్డేట్ ను ఇచ్చింది.
సలార్-2 కి సంబంధించిన డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేసింది.. శౌర్యాంగపర్వంలో ఎలాంటి అంశాలు ఉండొచ్చనే విషయాలపై హింట్ ఇస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో ‘ ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్ యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇంకో పక్క వేలమంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా.. అదే కుర్చీని వరదా కు ఇస్తానని మాటిచ్చాడు. కానీ.. దాని మీద కూర్చునే హక్కు దేవాది.’ అంటూ సాగిన డైలాగ్ ప్రోమో అదిరిపోయింది. ఖాన్సర్ కుర్చీ మీద దేవా కూర్చుంటాడా.. లేక ఇచ్చిన మాట కోసం వరదా వెనుక నిలబడతాడా..అనే సందేహంతో పార్ట్2 పై ఈ ప్రోమో మరింత ఆసక్తిని పెంచేసింది. 34 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్గా మారింది.
Also Read
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
- Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
- Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
- India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
తాజావార్తలు
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
-
Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!