Tollywood: ఎట్టకేలకు ఎఫ్.డి.సి.కి కొత్త ఛైర్మన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. త్వరలో తెలంగాణాలోనూ సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఛైర్మన్ పదవిని భర్తీ చేసిందనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
ఇదిలా ఉంటే… కరీంనగర్ జిల్లా రాంనగర్ కు చెందిన అనిల్ కుమార్ కూర్మాచలం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ప్రస్తుతం యు.కె.లో ఐటీ కన్సెల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాలలో ఉన్న తెలంగాణీయులను ఒక్క త్రాటిపైకి తీసుకురావడానికి అనిల్ విశేష కృషి చేశారు. కొవిడ్ సమయంలోనూ యూకేలో అక్కడి తెలంగాణ వాసులకు విశేష సేవలు అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణతో పాటు వికాసం విషయంలోనూ అనుభవం ఉన్నందునే అనిల్ కుమార్ కు ఎఫ్.డి.సి. ఛైర్మన్ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా ఉత్తర్వులు వెలువడిన వెంటనే అనిల్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు.
- Tags
- FDC Chairman
- kcr
- telangana
- Tollywood
- TRS
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!