Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook reaction on England Lost To Sri Lanka: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఏకంగా 430 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరించాయి. అయితే శ్రీలంక బ్యాటర్లు తమని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. బౌలింగ్‌లో తాము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయామని, ప్రత్యర్థి బలాలకు తగ్గట్టుగా ఆడినట్లు తెలిపాడు. డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం అని, మ్యాచ్ ఓడినందుకు చాలా బాధగా ఉందని బ్రూక్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన క్రికెట్ మ్యాచ్. రెండు జట్లు అత్యుత్తమంగా ఆడాయి. అయితే దురదృష్టవశాత్తూ శ్రీలంక మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. బౌలింగ్‌లో మేము వెనకపడిపోయాం. కొన్ని సందర్భాల్లో మా బౌలర్లు పేలవంగా బంతులు వేశారు. లంక ప్లేయర్స్ అద్భుతం. చాల బాగా బ్యాటింగ్ చేశారు. 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం అంటే మాటలు కాదు. శ్రీలంక జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా పరుగులు సాధించడం సంతోషంగా ఉంది. అయితే జట్టు ఓడిపోయినప్పుడు డబుల్ సెంచరీకి కూడా విలువ ఉండదు. ఈ ఓటమితో నా ప్రదర్శనపై సంతృప్తిగా లేను. డబుల్ సెంచరీ చేయడం కంటే గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండటమే ముఖ్యం’ అని పేర్కొన్నాడు.
Also Read
- SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
- HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
- Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
- Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
తదుపరి మ్యాచ్‌లకు ముందు జట్టు కొన్ని విషయాలను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉందని బ్రూక్ తెలిపాడు. ఎక్కడ తప్పు జరిగిందో తమకు తెలుసని, ముఖ్యంగా బౌలింగ్‌లో అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని వెల్లడించాడు. ఫైనల్‌కు చేరేందుకు రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు మంచి అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితుల్లోనూ తమపై నమ్మకం ఉంచాలని, సాధారణమైన ప్రణాళికతో ముందుకు సాగాలని బ్రూక్ సూచించాడు. ఓటమి నుంచి బయటపడి, ధైర్యంగా తలలు పైకెత్తి తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని జట్టుకు పిలుపునిచ్చాడు.
రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 430 పరుగులు సాధించింది. దీంతో 2 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం శ్రీలంకకు అరుదైన ఘనతగా నిలిచింది. ఈ విజయంతో ట్రై సిరీస్‌లో శ్రీలంక తన సత్తా చాటగా.. ఇంగ్లండ్ ఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవడానికి రాబోయే మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Harry Brook: డబుల్ సెంచరీ చేసినా ఏం లాభం.. చాలా బాధగా ఉంది!
-
Sai Krishna Death Case: విజయవాడ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ..
-
Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
-
SL Vs Eng: ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో నమోదైన 10 అద్భుతమైన రికార్డులు.. లిస్ట్ ఇదే..
-
Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!