ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బాలీవుడ్ సెలబ్రెటీలందరికి సబ్యసాచి డిజైన్స్ నుంచే బట్టలు కానీ, నగలు కానీ వెళ్తాయి.. ఆయన డిజైన్స్ అలా ఉంటాయి. ఇక ఇటీవల సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతున్నాయి. మొన్నటికి మొన్న మంగళ సూత్ర యాడ్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయించి నెటిజన్ల చేత తిట్లు తిన్న ఈయన మరోసారి మోడల్స్ విషయంలో నెటిజన్ల కళ్లలో పడ్డాడు.
తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్ కలెక్షన్-2021 పేరిట కొత్త కలెక్షన్స్ రిలీజ్ చేశాడు సబ్యసాచి ముఖర్జీ. ఆభరణాలు చూడడానికి చాలా బావున్నాయి కానీ, వాటిని ధరించిన మోడల్స్ మోహంలో మాత్రం చిరునవ్వు కనిపించలేదు. దీంతో మరోసారి నెటిజన్స్ ఆయనను ఏకిపారేశారు. అంత్యక్రియలకు వేసుకెళ్లే ఆభరణాలా..? అని కొందరు.. మొగుడు చచ్చినట్లు ఆ మొహం ఏంటి..? అని మరికొందరు.. వీరు మోడల్సా ..? అని ఇంకొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మోడల్స్ అంటే నిత్యం నవ్వకపోయినా.. వారి ఫేస్ లో సాడ్ నెస్ కనిపించకూడదు.. కానీ ఇక్కడ ఉన్న మోడల్స్ ముఖంలో చావు కళ కనిపిస్తోంది. ఇదేనా మీరు చేసిన యాడ్.. ఇలాంటి మోడల్స్ నా తీసుకొనేది అంటూ సబ్యసాచిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్.. మరి ఈ విమర్శలపై సబ్యసాచి ఏమంటాడో చూడాలి.