నెట్ ఫ్లిక్స్ మానేజ్మెంట్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది అంతుబట్టని విషయంగా ఉంది. గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి స్టార్ హీరోల సినిమాలకి బడ్జట్స్ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. దీని కారణంగా చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా అయితే అనౌన్స్ అయ్యి మరీ ఆగిపోయింది. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓటీటీ రైట్స్ విషయంలో వేడి వేడి చర్చ జరుగుతుంది. ఈ మ్యాటర్ ని డీల్ చేయడానికో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ ఏకంగా నెట్ ఫ్లిక్స్ సీఈవో, ఇండియా హెడ్, కంటెంట్ అక్విజేషన్ హెడ్ లు తెలుగు స్టార్ హీరోస్ అందరినీ కలుస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ని కలిసాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లోపు ఎన్టీఆర్ అండ్ దేవరని టీమ్ ని నిన్న కలిసి లంచ్ చేసారు. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోస్ ని కలిసిన టెడ్ సరండోస్… ఈరోజు మార్నింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని గుంటూరు కారం టీమ్ ని మీట్ అయ్యాడు. లేటెస్ట్ గా లంచ్ కి నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ తో పాటు నెట్ క్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షేర్గిల్, కంటెంట్ అక్విజిషన్ హెడ్ అభిషేక్ గోరాడియాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని మీట్ అయ్యారు. ప్రభాస్ అండ్ కల్కి టీమ్ ని కలిసిన టెడ్ సరండోస్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ టెడ్ సరండోస్ ఏ విషయం గురించి మాట్లాడడానికి హైదరాబాద్ వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది.