Neena Gupta: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 లో నటిస్తోంది. కాజోల్.. తమన్నా.. మృణాల్ ఠాకూర్.. విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. శృంగార వాంఛలను కొంతమంది మహిళలు ఎలా అదుపులో పెట్టుకుంటున్నారు అనే కథాంశంతో బోల్డ్ సిరీస్ గా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ అభిమానుల్లో హీట్ పుట్టించింది. ముఖ్యంగా నీనా గుప్తా డైలాగ్స్ అయితే మరింత ఘాటుగా ఉన్నాయి. పెళ్ళికి ముందే టెస్ట్ డ్రైవ్ చేయాలి అని మనవరాలిని.. పెళ్ళికి ముందే శృంగారం చేయడానికి ప్రేరేపించిన బామ్మగా కనిపించింది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో సైతం ఆమె అంతే ఘాటు వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. సాధారణంగా ఇండియా లో శృంగారం గురించి కానీ, బూతు మాటల గురించి పైకి చెప్పడానికి జంకుతారు. ముఖ్యంగా పిల్లల ముందు ఇలాంటి మాటలు అనడానికి కూడా పేరెంట్స్ సిగ్గుపడతారు. అయితే ఈ జనరేషన్ పిల్లలకు సెక్స్ గురించి కానీ, బూతు డైలాగ్స్ కానీ నేర్పించడం అవసరమని ఆమె చెప్పుకొచ్చింది.
Vijay: బన్నీ సాంగ్ కు విజయ్ డ్యాన్స్.. మరోసారి వైరల్ గా బుట్టబొమ్మ
” ఈ జనరేషన్ పిల్లలకు శృంగారం గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకునేదాన్ని. నాలానే చాలామంది అపోహ పడినవారు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల కు శృంగార సంబంధిత విషయాల ను తెలియకుండా చూసేవారు. ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్.. తమ పిల్లల వద్ద శృంగారం గురించి మాట్లాడాలి అనుకోరు. కానీ, ఇప్పటి కాలం పిల్లలకు .. వాటి గురించి తెలియజేయాలి. అందుకే లస్ట్ స్టోరీస్ 2 తెరకెక్కించారు. ఇందులో శృంగారానికి సంబంధించిన విషయాలు చాలా తెలుస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నీనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.