NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య – కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK 112 : టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ‘ఆచార్య’, ‘దేవర’ చిత్రాల తర్వాత కొరటాల శివ సరికొత్త కథతో బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ‘#NBK112’ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ వేదిక, ముహూర్తం సమయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు అత్యంత ఘనంగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ (TTD) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. దైవసన్నిధిలో, అదీ ఏపీ రాజధాని నడిబొడ్డున ఈ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా ముహూర్తపు వేడుకకు నందమూరి, నారా కుటుంబాల నుంచి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. సినిమా ముహూర్తపు షాట్‌కు చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టనుండగా.. నారా లోకేష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు కొరటాల శివకు అందించే అవకాశం ఉందని టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్‌కు, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం అని బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
-
Prabhas : రెబల్ ఫ్యాన్స్ యుద్ధానికి సిద్ధమవండి!
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!