Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది. దీంతో అజిత్ అభిమానులు కొద్దిగా నిరాశను వ్యక్తపరిచారు. ఇక ఈ సినిమా తరువాత అజిత్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో AK62 ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అజిత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. నయన్, విగ్నేష్ పెళ్లి తరువాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా అజిత్- నయన్ ది హాట్ కాంబో. వారిద్దరు కలిసి మూడు సినిమాలు తీయగా.. మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి దీంతో ఈ సినిమా కూడా హిట్ టాక్ అందుకుంటుందని అజిత్ అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా తల్లకిందులుగా మారినట్లు తెలుస్తోంది.
Read Also: Buddha Venkanna: మంత్రి అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి
AK62 నుంచి విగ్నేష్ ను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో అజిత్ కు విగ్నేష్ కు తేడా రావడంతో విగ్నేష్ ను తొలగించి అదే ప్లేస్ లో తడం డైరెక్టర్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే పోతే పోయింది.. డైరెక్టర్స్ మారుతూ ఉండడం కామన్.. హిట్ కాంబో నయన్- అజిత్ ఉన్నారుగా.. డైరెక్టర్ మారితే ఏమవుతుందిలే అని అభిమానులు అనుకుంటున్న సమయంలో నయన్ సైతం అజిత్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. తన భర్త విగ్నేష్ ను ముందు డైరెక్టర్ గా ప్రకటించి ఇప్పుడు తొలగించి అవమానించిన అజిత్ సరసన నయన్ నటించను అని చెప్పేసినట్లు సమాచారం. దీంతో నయన్ భర్తను అవమానించి అజిత్ తప్పు చేశాడేమో అని కొందరు.. భర్తను అవమానిస్తే నయన్ ఊరుకుంటుందా.. అందుకే ఆ పని చేసి ఉంటుంది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Read Also: NBK: అఖండ కాంబినేషన్ రిపీట్ అయ్యింది… టెలికాస్ట్ ఎప్పుడో?