Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం అమ్మతనంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. తన ఇద్దరు చిన్నారులను కంటికి రెప్పలా చూసుకొంటుంది. కెరీర్ మొదలుపెటినప్పటినుంచి ఎన్ని ఒడిదుడుకులను,రిలేషన్ షిప్స్ లో ఎన్నో చేదు అనుభవాలను పంచుకున్న నయన్.. ఎట్టకేలకు గతేడాది పెళ్లితో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నాలుగేళ్లు ప్రేమలో ఉండి .. 2022 జూలై 9 న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అయిన కొన్ని నెలలకే సరోగసీ ద్వారా ఈ జంట తల్లిదండ్రులుగా మారారు. ట్విన్స్ పుట్టడంతో.. వారికి ఉయిర్, ఉలగమ్ అని పేర్లు కూడా పెట్టారు. ప్రస్తుతం నయన్.. రోజు మొత్తం తన పిల్లతోనే గడుపుతుంది. వారు పుట్టిన దగ్గరనుంచి వారి ముఖాలను రివీల్ చేయని నయన్.. తాజాగా చిన్నారుల ముఖాలను రివీల్ చేసింది.
Takkar Movie Review: టక్కర్
ఎందుకంటే ఈరోజు నయన్ – విగ్నేష్ కు స్పెషల్ డే.. నేటితో వారి పెళ్లి జరిగి ఏడాది పూర్తికావొస్తుంది. ఈ స్పెషల్ డే రోజున నయన్.. తన చిన్నారులతో కలిసి ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. వైట్ అండ్ బ్లూ జీన్స్ లో నయన్.. తన పొత్తిళ్ళలో ఇద్దరు చిన్నారులను పట్టుకొని నవ్వులు చిందించింది. ఇక ఈ ఫోటోలను విగ్నేష్ షేర్ చేస్తూ.. “ఏడాది కక్షణాల్లో గడిచిపోయినట్టుంది. ఈ ఏడాదిలో ఎన్నో ఎత్తుపల్లాలు.. ఊహించని ఎదురుదెబ్బలు! పరీక్ష సమయాలు.. కానీ, నీ అపారమైన ప్రేమను మరియు ఆప్యాయతను చూడడానికి ఇంటికి రావాలనే ధైర్యాన్ని నాకు ఇస్తుంది. నేను కన్న కలలు మరియు లక్ష్యాలను అందుకోవడానికి ఆ ప్రేమ నాకు శక్తిని ఇస్తుంది. అన్ని నీతోనే పంచుకోవాలనుకుంటున్నాను.. నా ఉయిర్, ఉలగమ్ తో పాటుగా.. విబేధాలు ఏవైనా కుటుంబం తొలగించేస్తుంది. ఇలాంటి బెస్ట్ పీపుల్ నా చుట్టూ ఉన్నందుకు నేను అదృష్టవంతుడును ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.