Takkar Movie Review: టక్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2 / 5
- MAIN CAST: Siddharth, Divyansha Kaushik, Abhimanyu Singh, Yogibabu
- DIRECTOR: Karthik G. Krishna
- MUSIC: Niwas K. Prasanna
- PRODUCER: TG Vishwaprasad, Abhishek Agarwal, Sudhan Sundaram, G. Jayaram
Takkar Movie Review: సిద్ధార్థ్ పేరు వినగానే ‘బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇటు తెలుగు అటు తమిళంలో ఫామ్ కోల్పోయిన సిద్ధార్థ్ పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్నాడు. ‘మహాసముద్రం’తో రీఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అందుకోలేక పోయాడు. తాజాగా తను నటించిన తమిళ సినిమా ‘టక్కర్’ తెలుగులో అనువాదమై ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.
కథ విషయానికి వస్తే గుణశేఖర్ (సిద్దార్థ్) పేదింటి కుర్రాడు. దాంతో డబ్బు సంపాదన కోసం పుట్టిన ఊరు నుంచి వైజాగ్ వస్తాడు. డబ్బు సంపాదనలో భాగంగా రకరకాల జాబ్స్ చేసినా తన కోపం వల్ల ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేక పోతాడు. అలా కాదని బెంజ్ కారును ట్యాక్సీగా నడుపుతుంటాడు. అయితే ఓ ప్రమాదం వల్ల కారు డ్యామేజ్ అయి యజమాని చేతిలో దెబ్బలు, తిట్లు తిని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ధైర్యం సరిపోక రౌడీ మూకల వద్దకు వెళితే వారే చంపేస్తారని భావిస్తాడు. అయితే అసంకల్పిత ప్రతీకారచర్య తో ఆ రౌడీలను కొట్టి వారి కారు తీసుకుని పారిపోతాడు. ఆ కారు డిక్కీలో రౌడీలు కిడ్నాప్ చేసిన ఓ అమ్మాయి ఉంటుంది. అంతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. అసలా అమ్మాయి ఎవరు? తనని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆపై గుణశేఖర్ జీవితం ఎలాంటి మలుపులు తిరగిందన్నదే మిగతా కథ.
Also Read
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
సిద్దార్థ్ నటించిన ఈ రోమ్ క్యామ్ మూవీ ‘టక్కర్’ ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకునేలా సాగక పోవడం విశేషం. అసలు సిద్దూ గెటప్ తోనే ఆడియన్స్ ఇన్ వాల్వ్ మెంట్ను దూరం చేశాడు దర్శకుడు కార్తీక్ క్రిష్. ఏదో సాధించి ఎత్తుకు ఎదగాలనుకున్న హీరోను ఆత్మహత్య చేసుకోవాలనుకునే పిరికి వాడిగా చూపించటంలోనే దర్శకుడు తనేం చెప్పదలచుకున్నాడో అది పూర్తిగా మిస్ అయ్యాడు. చావటానికి ధైర్యం లేని హీరో రౌడీల వద్దకు వెళ్ళి చావాలనుకోవడం, వెంటనే వారి మీద తిరగబడి చితకబాదేయడం దర్శకుడు బుర్రనుంచి వచ్చిన బహు విచిత్రాలు. కిడ్నాప్ అయిన హీరోయిన్ తో హీరో ప్రేమ. ఆ తర్వాత పెళ్ళికాకుండానే వారి శోభనం మొదలైనవి ఆయన దరిద్రపు టేకింగ్ కి పరాకాష్ట.
ఇమేజ్ కు భిన్నమైన పాత్ర చేసిన సిద్ధార్థ్ సైతం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయాడు. ఇందులో తన లుక్ గురించి ఎంత తక్కువ చెప్పకుంటే అంత మంచిది. హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ చూడటానికి బాగున్నా ఆ పాత్రలో ఎలాంటి వైవిధ్యం లేకోవడంతో అంతగా ఆకట్టుకోదు. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్, కామెడీ పాత్రలో యోగిబాబు ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారనే చెప్పాలి. ఇక ఈ సినిమాలోని పాటల్లో ఏ ఒక్కటి మళ్ళీ హమ్ చేసుకునేలా లేదు. నిర్మాణ విలువలు సోసో. ఈ తరహా సినిమాను పీపుల్స్ మీడియా వారు ఎందుకు రిలీజ్ చేశారో వారికే తెలియాలి. వరుస సినిమాలతో జోరుమీదున్న ఈ సంస్థ ఇలాంటి సినిమాలను ఎటెమ్ట్ చేస్తూ పోతే వారి రిపుటేషన్ దెబ్బతినటం ఖాయం. సో బికేర్ ఫుల్.
ప్లస్ పాయింట్స్
సిద్ధార్థ్ సినిమా కావటం
పీపుల్స్ మీడియా రిలీజ్ చేయటం
మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
సిద్ధార్గ్ లుక్
పాటలు
రేటింగ్ – 2/5
ట్యాగ్ లైన్: చూస్తేనే చక్కర్
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!