దేవాలయాలు అనేవి ఎంతో పవిత్రతతో కూడుకున్నవి.. అక్కడికి వెళ్లేవారు ఎంతో పవిత్రతతో వెళ్లాలి. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి.. అలాంటి దేవాలయాల్లో ఎవరు ఎటువంటి తప్పు చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే.. తాజాగా కొత్త పెళ్లి కూతురు నయన్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మందిపడుతున్నారు పలువురు హిందూ వర్గ సభ్యులు.. ఆమె అంత తప్పు ఏం చేసింది అంటే.. హిందువులకు పరమ పవిత్రమైన శ్రీనివాసుని దేవాలయంలో చెప్పులతో నడిచింది.. కోలీవుడ్ లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న నయనతార- విగ్నేష్ శివన్ నిన్న గురువారం పెళ్లితో ఒక్కటి అయిన విషయం విదితమే.. పెళ్లి అయిన తెల్లారే ఈ జంట తిరువమా శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు కూడా అందుకున్నారు.
ఇక్కడివరకు బాగానే ఉంది. పూజా అనంతరం నయన్ స్వామివారి కొలువు తీరిన మాడ వీధుల్లో చెప్పులతో నడిచింది. శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం నిషేధం అని తెలిసినా నయన్ చెప్పులతో నడవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నయన్ చెప్పులు వేసుకొని నడుస్తుంటే పూజారులు ఏమి చేస్తున్నారు..? వెంటనే నయన్.. పవిత్రమైన స్థలంలో చెప్పులతో నడిచినందుకు స్వామివారిని క్షమించమని కోరాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరికొందరు పెళ్లయిన మొదటిరోజే కొత్త పెళ్లికూతురు వివాదంలో చిక్కుకుందే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఘటనపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.