విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది.
Read Also : Nithya Menen : యూట్యూబ్ పై కన్నేసిన బ్యూటీ… సొంతంగా ఛానల్ !
కాగా “కాతు వాకుల రెండు కాదల్” తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూర్చగా, ఈ ప్రాజెక్ట్‌కి విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందించారు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో లీడింగ్ లేడీగా నటిస్తోంది. ఇక విఘ్నేష్ అజిత్ కుమార్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.