మల్టీ ట్యాలెంటెడ్ మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ ఇప్పుడు యూట్యూబ్ పై కన్నేసింది. ఇప్పటిదాకా వెండితెరపై తన ట్యాలెంట్ ను చూపించిన ఈ భామ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అభిమానులకు మరింత దగ్గర కాబోతోంది. ఆ గుడ్ న్యూస్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది నిత్యా. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దానికి ఆమె ‘నిత్య అన్‌ఫిల్టర్డ్’ అని టైటిల్ పెట్టారు. ఛానెల్‌లో సినీ ప్రపంచంలో ఆమె 12 సంవత్సరాల ప్రయాణం గురించి ఫస్ట్ వీడియోను పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరిన్ని వీడియోలు త్వరలో ఈ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయబోతున్నాను అని నిత్య పేర్కొంది. ఇక నిత్యా మీనన్ ఈ విషయాన్ని అలా ప్రకటించిందో లేదో ఇలా వేలాది మంది సబ్ స్క్రైబ్ అయ్యారు.
Read Also : RGV : అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్
నిత్యా మీనన్ ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ అనే OTT సింగింగ్ పోటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇక ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న “భీమ్లా నాయక్”లో పవన్ కళ్యాణ్ కు జోడిగా కన్పించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నిత్యా నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు.