Nayanthara: కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం విదితమే. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నయన్ కోరుకున్న ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీటలు ఎక్కింది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక ఇటీవలే హనీమూన్ ను కూడా ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. ప్రస్తుతం నయన్, షారుఖ్- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న జవాన్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయన్ కు అస్వస్థత అని కోలీవుడ్ కోడై కూస్తోంది. నిన్నటి నుంచి ఆమెకు వాంతులు అవుతుండడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేసినట్లు సమాచారం.
కాగా రెండు గంటల తరువాత నయన్ ను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సడెన్ గా వాంతులు అని తెలియడంతో అభిమానులు నయన్ ప్రెగ్నెంట్ అయ్యింది అంటూ వార్తలు గుప్పిస్తున్నారు. ఈ జంటకు పెళ్లి అయ్యి కేవలం మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే గర్భవతి ఎలా అవుతోంది అని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ బాలీవుడ్ జంట అలియా- రణబీర్ కపూర్ ను ఈ జంట ఆదర్శంగా తీసుకున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విగ్నేష్ చేతి వంట తినడం వలన ఫుడ్ ఫాయిజన్ కావడం వలనే ఆమెకు వాంతులు అయ్యాయని, మరే గుడ్ న్యూస్ లేదని తెలుస్తోంది. దయచేసి ఇలాంటి పుకార్లను స్ప్రెడ్ చేయవద్దని నయన్- విగ్నేష్ సన్నహిత వర్గాలు మీడియాను కోరినట్లు సమాచారం. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఈ ప్రేమ జంట నోరు విప్పాల్సిందే అంటున్నారు అభిమానులు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు నోరు విప్పుతుందో చూడాలి.