Nayakudu: రజినీ, కమల్ మెచ్చిన ‘నాయకుడు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు. ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. నాయకుడు పేరుతో ఈ సినిమా రేపు థియేటర్ లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ .. ఈ సినిమాపై రజినీకాంత్, కమల్ హాసన్ చేసిన ట్వీట్స్ ను అభిమానులతో పంచుకుంది. సినిమా చాలా బావుందని వారు ప్రశంసించిన ట్వీట్స్ ను నాయకుడు పోస్టర్ కు ఎటాచ్ చేసి ట్వీట్ చేసింది.
Anand Devarakonda: అనసూయ- విజయ్ గొడవ.. కుక్కలు అలాగే కొట్టుకుంటాయి అన్న ఆనంద్
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
“మామన్నన్.. సమానత్వాన్ని మారి సెల్వరాజ్ ఈ సినిమా ద్వారా ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. అద్భుతమైన నటన కనబరిచిన వడివేలు, ఉదయనిధి, ఫహద్ ఫాసిల్‌లకు నా అభినందనలు” అని రజినీ చెప్పగా.. ” నా అభిప్రాయంలో అందరు మనుషులు సమానమే. మామన్నన్.. నా అబిప్రాయానికి ధైర్యాన్ని ఇచ్చింది. చిత్ర బృందానికి నా అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్స్ ను షేర్ చేస్తూ.. ” లెజెండ్స్‌ను మంత్రముగ్ధులను చేసి, తమిళనాడులో వారి హృదయపూర్వక ప్రశంసలను గెలుచుకున్న చిత్రం మామన్నన్.. రేపటి నుండి నాయకుడుగా తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
The film, which mesmerised the LEGENDS and won their heartwarming accolades in Tamilnadu❤️🔥#Mamannan is all set to amaze the Telugu audience as #Nayakudu from TOMORROW 🤩
Release by @AsianCinemas_ @SureshProdns@Udhaystalin @mari_selvaraj @KeerthyOfficial #FahadhFaasil pic.twitter.com/42K2UBo1os
— Suresh Productions (@SureshProdns) July 13, 2023
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!