Naresh:టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్‌ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ జరిగే ఏ ఎన్నికలైనా కోలాహలంగా ఉంటాయి.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లా ఉంటాయి. ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి. నిర్మాత బాగుంటేనే అందరూ బాగుంటారు. ఇక మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు. దాని గురించి ఆయన చెప్తేనే బావుంటుంది. జనరల్ బాడీలో రిసొల్యూషన్ పాస్ అయ్యింది. దాని గురించి నాకంటే కూడా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్తేనే బావుంటుంది.
నేను ఈ ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలేదు అంటే.. నేను ఆర్గనైజేషన్ లో పనిచేశాను. నాకు ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఛాంబర్ లో నేను L బోర్డు. నేను వచ్చి ఓటు వేసి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఛాంబర్ లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు.. పనిచేసేవాళ్ళు ఉన్నారు.. బాధ్యత గలవారు ఉన్నారు కాబట్టి.. నేను ఎప్పుడు ఓటు వేయడానికే ముందు ఉంటాను. అది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతాను. ఎటువంటి సమస్య వచ్చినా నా గళాన్ని విప్పడానికి నేనెప్పుడూ వెనుకాడను. ఆంధ్రా, తెలంగాణ అనే తేడాను ఎన్నికల్లో చూపిస్తున్నారు అన్నదాని మీద నేను మాట్లాడను. సినిమా వాళ్లకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనేది లేదు.. మేమంతా ఒక్కటే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు ని అడగండి నన్ను కాదు : తెలుగు సినీ నటుడు : నరేష్#Naresh #manchuvishnu#MAA #MovieAssociation #Tollywood #producers #NTVTelugu #NTVENT pic.twitter.com/Gm2QYSwgV4
— NTV Telugu (@NtvTeluguLive) July 30, 2023