న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. కొత్త ఏడాది మరో సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాడు. ‘బ్రోచేవారేవరురా’ లాంటి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ని డిఫరెంట్ గా రిలీజ్ చేసి ఆసక్తిని పెంచిన చిత్ర బృందం తాజాగా మరో అప్డేట్ ని ఇచ్చింది. ఈ చిత్రంలో సుందర్ ప్రసాద్ గా నాని కనిపించనున్నాడు. ఆయన ఫస్ట్ లుక్ ని నూతన సంవత్సర సందర్భంగా రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ” కే పి వి ఎస్ ఎస్ పి ఆర్ సుందర్ కుమార్ జీరోత్ లుక్ ని కొత్త సంవత్సరం జనవరి 1న 2022 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ నాని ” శ్యామ్ ఈ ఏడాదిని విహారిగా ముగించాడు.. సుందర్ హగ్గింగ్ ఫేస్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే సమయం వచ్చేసింది.. అతని పరిచయం జనవరి 1″ అంటూ పోస్ట్ చేశారు. మరి నాని లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Shyam ends the year on a high.
— Nani (@NameisNani) December 30, 2021
Time for sundar to start the new year with a bang 🤗
His parichayam on Jan 1st 🙂#ZerothLookOfSundar #NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi #AnteSundharaniki pic.twitter.com/tUrStumbfC