Avika Gor New movie titled as Ugly Story: లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందివ్వడంలో మొదటి వరుసలో ఉంటారని తెలిసిందే. సినిమా చూపిస్త మావ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్ సినిమాలను నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. అందరికీ సుపరిచితుడు, సింగర్ గీతామాధురి భర్త అయిన నందు హీరోగా నటించిన ఈ సినిమాలో ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Dhanush: హీరో ధనుష్‌కి షాక్.. కొడుకు చేసిన పనికి ఇంటికి వచ్చిన పోలీసులు
ఎంతో మంది కొత్త దర్శకులని పరిచయం చేసిన బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి ప్రణవ స్వరూప్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు, ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా సినిమాకి “అగ్లీ స్టోరీ” అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు. శ్రీసాయికుమార్ దారా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవరిస్తున్న ఈ సినిమాకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరబట్ల, వరికుప్పల యాదగిరి, కడలి ఈ సినిమాకు లిరిక్స్ అందించారు.