Dhanush Son Fined: స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. ఎక్కువగా ప్రోఫెషనల్ లైఫ్‌తో వార్తల్లో నిలిచే ధనుష్.. భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులతో హాట్‌టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి డైవోర్స్‌ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిద్దరికి సంబంధించి ఏదోక వార్త తరచూ బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ మాజీ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. టీనేజ్ వయసులో ఉన్న వారిని ధనుష్ పెద్దగా మీడియా ముందుకు తీసుకురాలేదు. అందుకే వారు బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. కానీ, ధనుష్ పెద్ద కొడుకు యాత్ర ఓ పని చేసి హాట్‌టాపిక్ అయ్యాడు. రాకరాక ఓ వివాదంతో వార్తల్లోకి ఎక్కాడు. యాత్ర చేసిన పనికి ఏకంగా పోలీసులే ఇంటికి వచ్చి జరిమానా వేసి వెళ్లారట.
Also Read: Dog Meat: శతాబ్ధాల సంప్రదాయం.. కుక్క మాంసం వినియోగానికి స్వస్తి చెప్పనున్న ఆ దేశం..
అసలేం జరిగిందంటే..
ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రీసెంట్‌గా టూవీలర్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో బాడిగార్డ్ యాత్రకు బైక్ ఎలా నడపాలో నేర్పిస్తూ కనిపించాడు. అయితే యాత్ర వయసు ఇంకా 15 ఏళ్లే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ధనుష్ నివాసం షోయస్ గార్డెన్ ఏరియాలో బైక్ నడిపాడు. దాన్ని అక్కడే ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడయాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఏకంగా ధనుష్ ఇంటికే వెళ్లారట. అది ధనుష్ కొడుకా ? కాదా? అని క్లారిటీ తెచ్చుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపడమే కాదు హెల్మెట్ ధరించకుండ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడంటూ రూ. 1000 జరిమానా విధించారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read: Pindam: రిలీజ్ డేట్ వచ్చేసింది.. గజ గజ వణకడానికి సిద్ధం కండి