Nandita Swetha Becomes emotional at Hidimba Thank you meet: అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందితా శ్వేత హీరోయిన్ గా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్ ని నిర్వహించగా నందితా శ్వేతా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ హిడింబ అందరికీ గొప్పగా రీచ్ అయ్యిందని, సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారని అన్నారు. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆమె వికాస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారని అన్నారు.
Sai Dharam Tej: అభిమానులకి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం!
ఇక ఆ అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సినిమా నాకు ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతుందని, ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారని అన్నారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్న ఆమె ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇదని అన్నారు. దర్శకుడు అనిల్ గారు నాకు చాలా పవర్ ఫుల్ రోల్ ఇచ్చారని, మకరంద్ దేశ్ పాండే గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇక అశ్విన్ తో వర్క్ చేయడం చాలా నచ్చిందని పేర్కొన్న ఆమె తను అద్భుతమైన నటుడు, తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నానని అన్నారు.