Taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో నందమూరి తారక రత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తారకరత్న ఆ తరువాత అంతటి సక్సెస్ ను హీరోగా అందుకోలేకపోయాడు. ఇక అమరావతి సినిమాతో విలన్ గా మారి మెప్పించినా అది కూడా అంతంత మాత్రంగానే ఆడడంతో అది కూడా సెట్ కాలేదు. ఇక హీరోగా, విలన్ గా నిలదొక్కుకోవడానికి ఈ నందమూరి హీరో చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కాగా, చాలా గ్యాప్ తరువాత తారకరత్న నటించిన చిత్రం ‘మిస్టర్.తారక్’. రమేష్ విబూధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూసల మధు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
“నేను నమ్ముకున్న వైఫ్ ఇంకొకడితో బెడ్ ఎక్కింది.. కోరుకున్న లైఫ్ ఇలా రోడ్డెక్కింది” అని తారకరత్న చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభయ్యింది. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ ము క్రియేట్ చేసింది. సొంత భార్య తన భర్త స్నేహితుడితో ఎఫైర్ పెట్టుకొని అతడ్నే చంపడానికి ప్లాన్ చేసి.. ఏం తెలియని అమ్మాయిలా మళ్లీ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయడం, ఇక మరోపక్క చనిపోయిన తారకరత్న ఒక మిస్టీరియస్ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడం, అంతకుముందు ఏం జరిగింది అనేది గుర్తుకు రాకపోవడం లాంటి సీన్స్ చూపించారు. సినిమా కథ ఏంటి అనేది పూర్తిగా రివీల్ చేయలేదు కానీ.. ఏదో కొత్త కథతో తారకరత్న రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో తారకరత్న సరసన షారా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా ఈ నందమూరి హీరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
https://www.youtube.com/watch?v=q0IghOWr9FE