Nandamuri Mokshagna: నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తాడు.. అదుగో వస్తాడు అని చెప్పడం తప్ప.. ఒక్క అడుగు కూడా నందమూరి మోక్షజ్ఞ ముందుకు వెయ్యడం లేదు. మొదట్లో కథ కోసం లేట్ అయ్యింది అనుకున్నారు. కానీ, బాలయ్య.. కొడుకు కోసం కథ సిద్దంగానే ఉంది అన్నాడు. వెంటనే.. డైరెక్టర్ ను వెతికే పనిలో ఉన్నారు అన్నారు.. ఏ.. లేదు మంచి డైరెక్టర్ ను కూడా సెట్ చేశామని మరో వార్త వచ్చింది. ఇవేం కాదు.. మోక్షజ్ఞ మేకోవర్ సరిగ్గా లేదు.. హీరో మెటీరియల్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే అని వార్తలు వచ్చాయి. ఎలాగోలా కష్టపడి మోక్షజ్ఞ హీరో లుక్ లోకి వచ్చాడు. హా.. మరి ఇంకేంటి.. నందమూరి వారసుడు ఆగమనమే. ఎప్పుడు మీడియా ముందుకురాని మోక్షజ్ఞ.. ఈ మధ్య బాగానే కెమెరా కంటికి చిక్కుతున్నాడు.
Raghava Lawrence: చంద్రముఖి 2 ప్లాప్.. డైరెక్టర్ తప్పే.. ?
బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇక ఈ ప్రమోషన్స్ లో మోక్షజ్ఞ కూడా ఉండడం విశేషం. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ కుర్రాడు.. శ్రీలీల వెంటే కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న సెట్ లో ఆమెతో మాట్లాడుతూ కనిపించాడు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో సైతం ఆమె వెనుకే నిలబడి కనిపించాడు. ఇక దీంతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. శ్రీలీల హీరోయిన్ కన్ఫర్మ్ అని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది అయితే జంట బానే ఉంది.. కథ బావుంటే.. హిట్ పక్కా అని జోస్యం కూడా చెప్పుకొస్తున్నారు. మరి శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు తిరగడానికి కారణం ఇదా.. మరింకేదైనా అనేది తెలియాల్సి ఉంది.