Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. హారర్ ఫిల్మ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన లారెన్స్ నుంచి కూడా ఈలాంటి సినిమాను అభిమానులు ఎక్స్పెక్ట్ చేయలేదు. చంద్రముఖి 2 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. తమిళ్ లో కొద్దో గొప్పో ఆడినా.. తెలుగులో మాత్రం భారీ డిజాస్టర్ మూటకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్లాప్ పై రాఘవ లారెన్స్ స్పందించాడు. ఆయన నటిస్తున్న జిగర్ తండా XX సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో లారెన్స్ కు చంద్రముఖి 2 ప్లాప్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
Varun- Lavanya: మరిది గారి పెళ్లి.. హంగామా అంతా వదినగారిదే.. ?
” ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చంద్రముఖి 2 ప్లాప్ అయ్యింది.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది” అన్న ప్రశ్నకు లారెన్స్ మాట్లాడుతూ.. ” చంద్రముఖి 2 వలన నాకు బాగా డబ్బు వచ్చింది.. నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ .. నాకు బాగా వర్క్ అవుట్ అయ్యింది. లైఫ్ లో అన్ని మనం గెలవాలి అనేది లేదు. ఎందుకంటే.. లైఫ్ లో గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ అయితే చాలురా అనుకున్నాను. అదే పెద్ద ఎచీవ్ మెంట్. అక్కడ నుంచి డైరెక్టర్ అయ్యింది ఇంకా పెద్ద బోనస్.. ఆ తరువాత హీరో అయ్యి కూర్చున్నా.. ఈ గ్లామర్ పెట్టుకొని హీరోయిన్ ను పిలుస్తుండడమే దేవుడు ఇచ్చిన వరం..మళ్లీ దాంట్లో ప్లాపా.. ? హిటా..? ఏం ఉండవు.. చేసుకుంటూనే ఉండాలి. మనం వెళ్తూనే ఉండాలి. హిట్, ప్లాపులు మనవెంట వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పడు జిగర్ తండా గురించి మాట్లాడితే.. ఈ సినిమా అనగానే నా కళ్లు.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు వైపే వెళ్తాయి. ఈ సినిమా గురించి నేను చెప్పను.. సినిమానే చెప్తుంది. జిగర్ తండా XX .. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసాను.. ఇదొక డైరెక్టర్ ఫిల్మ్. ఒక మంచి డైరెక్టర్ ఫిల్మ్ లో హీరో ఉంటే మంచి కథ ఉంటుంది. మంచి కథలోపల మనం ఉంటే హిట్ అవుతుంది. ఎంత పెద్ద హీరోయిజం చేసినా.. ఎన్ని డ్యాన్స్ లు చేసినా కథ లేదంటే.. ఓకే డైరెక్టర్ ఫిల్మ్ లేదంటే.. సినిమా ఆడడం లేదు. సో, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలంటే డైరెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలి.. కార్తిక్ సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ ” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్టర్ గా చంద్రముఖి డైరెక్టర్ స్ట్రాంగ్ కాదని, ఆయన చేసిన తప్పే.. సినిమా ప్లాప్ కు కారణమని లారెన్స్ చెప్పుకొచ్చాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.