Nandamuri Family: అన్నగారి కుటుంబం.. అసలైనవాడు కూడా ఉంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఇంకెన్నో. ఎన్టీఆర్ మనమధ్య లేకపోయినా.. ఆయన సాధించిన ఘనత, కీర్తి.. తెలుగువాడు ఉన్నంతవరకు ఉంటుంది. ఇక ఎన్టీఆర్ లెగసీని నందమూరి కుటుంబం ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి కుటుంబం ఘనంగా జరిపిన విషయం తెల్సిందే. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ పై గౌరవంతో.. ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెంను విడుదల చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇక నేడు.. ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెంను రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబంతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
Sudigali Sudheer: మళ్ళీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్.. గుడ్ న్యూస్ చేప్పేశాడు
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబం మొత్తం పాల్గొంది. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలు.. అల్లుళ్లు , కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా నందమూరి కుటుంబం మొత్తం ఒక్క ఫ్రేమ్ లో కనిపించారు. అయితే ఒకటే ఒక్క లోటు కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదే .. ఫోటోలో నందమూరి బ్రదర్స్ లేకపోవడం. నందమూరి హరికృష్ణ ఇద్దరు కొడుకులు.. తారక్, కళ్యాణ్ రామ్.. ఇద్దరు ఈ ఫ్రేమ్ లో మిస్ అయ్యారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని కాపాడడంలో తారక్ తనదైన రీతిలో కష్టపడుతున్నాడు. కానీ, ఇలా తాతగారికి ఇంత అరుదైన గౌరవం దక్కుతున్న సందర్భంలో ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దేవర షూటింగ్ కారణంగా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఏదిఏమైనా ఈ ఫోటో చూసిన అభిమానులు .. అన్నగారి కుటుంబం బావుంది.. అసలైన వాడు కూడా ఉంటే ఇంకా బావుండేది అని కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!