Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఎన్నికల్లో డబ్బు గెలిపిస్తుందా? లేక ప్రజాస్వామ్యంలో గెలుపు ఎప్పుడూ ప్రజలదేనా? సరిగ్గా ఇదే సవాల్ ఇప్పుడు అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. రిపబ్లికన్ పార్టీ విజయానికి ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కుమ్మరించారు. కాలిఫోర్నియాను వదిలి, తాను ఎంతో ఇష్టపడి స్థిరపడిన టెక్సాస్‌లో రిపబ్లికన్ జెండా ఎగరేయాలని సర్వశక్తులూ ఒడ్డారు. కానీ, మస్క్ కు ఊహించని షాక్ తగిలింది. డెమొక్రాట్లు ఘన విజయం సాధించి, టెక్సాస్‌లో దశాబ్దాల తర్వాత తొలిసారిగా గవర్నర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మరి ఈ రాజకీయ తుఫాను మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? అమెరికా పాలిటిక్స్‌లో ఇప్పుడు నడుస్తున్న ఈ హైవోల్టేజ్ డ్రామా వెనుక అసలు కథేంటి?
అమెరికా మధ్యంతర ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్యే కాకుండా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు, అమెరికన్ ప్రజాస్వామ్య వ్యవస్థకు మధ్య జరిగిన ఒక ప్రతిష్టాత్మక పోరాటంగా నిలిచాయి.గతంలో కాలిఫోర్నియాలో అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో విసిగిపోయిన మస్క్.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని రిపబ్లికన్ల కంచుకోట అయిన టెక్సాస్‌కు మార్చారు. ఇక్కడే తన స్పేస్ఎక్స్, టెస్లా, ఎక్స్ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు మస్క్ 250 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. ఇక తాజా మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల గెలుపు కోసం సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. టెక్సాస్‌లో రిపబ్లికన్లు ఓడిపోకుండా ఉండేందుకు తాను స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు.
Also Read
- Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
- Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
- Monkey Branching: డేటింగ్లో కొత్త ట్రెండ్.. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి?
కానీ, మస్క్ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి గ్రెగ్ అబాట్‌ను డెమొక్రాట్ అభ్యర్థి జినా హినోజోసా ఓడించారు. టెక్సాస్ చరిత్రలో గత ముప్పై ఏళ్లలో డెమొక్రాటిక్ గవర్నర్ గెలవడం ఇదే తొలిసారి. ఇక సెనెట్ అభ్యర్థిగా పోటీ చేసిన కన్ ప్యాక్టన్ కూడా జేమ్స్ తలారికో చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల వేళ తలారికోను ‘ఫార్-లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్’ అంటూ మస్క్ తీవ్రంగా విమర్శించినప్పటికీ, ఓటర్లు మాత్రం మార్పు వైపే మొగ్గు చూపారు.
ఈ పరాజయంపై మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఎన్నికల్లో తన స్పేస్ లేజర్లు పనిచేయలేదేమో.. అని పోస్ట్ చేశారు. అలాగే, స్పేస్ఎక్స్ భవిష్యత్తు కోసం అంతరిక్షంలోకి డేటా సెంటర్లు తరలిస్తామంటూ మరో పోస్ట్ పెట్టారు. అయితే, ఆయన సెటైర్లు ఎంత జోరుగా ఉన్నాయో, వాస్తవ పరిస్థితులు అంతకంటే కఠినంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టెస్లా షేర్లు 3.6 శాతం, స్పేస్ఎక్స్ షేర్లు 3.7 శాతానికి పైగా పడిపోవడం మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి తగిలిన తొలి దెబ్బగా చెప్పవచ్చు.
కొత్తగా గెలిచిన డెమొక్రాటిక్ నాయకత్వం మస్క్‌పై కన్నెర్రజేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా గవర్నర్ పీఠం చేపట్టిన జినా హినోజోసా.. టెక్సాస్‌లో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజలకు రక్షణ కల్పించకుండా, విద్యుత్ ఛార్జీలు పెరిగేలా ఇచ్చే పన్ను మినహాయింపులను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం మస్క్ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద అడ్డంకులు ఎదురుకావచ్చు. అంతేకాకుండా, స్పేస్ఎక్స్ విస్తరణ కోసం సముద్రతీరంలోని ఒక స్టేట్ పార్క్‌ను కొనుగోలు చేయాలని మస్క్ ప్రతిపాదించారు. అయితే “టెక్సాస్ అమ్మకానికి లేదు” అంటూ హినోజోసా కుండబద్దలు కొట్టేశారు.
కేవలం టెక్సాస్ లోనే లోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా మస్క్‌కు చిక్కులు తప్పేలా లేవు. హౌస్ ఓవర్‌సైట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాబర్ట్ గార్సియా.. ట్రంప్ యంత్రాంగానికి, మస్క్‌కు అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. “లాయర్లను సిద్ధం చేసుకోండి” అని ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే విభాగం- డోజ్ అధిపతిగా మస్క్ వ్యవహరించిన తీరు, ఫెడరల్ ఉద్యోగాల కోతలు, ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ విచారణకు సిద్ధమవుతోంది. స్పేస్ఎక్స్ పొందుతున్న భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలపై కూడా లోతైన దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.
“ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు” అనేది సామెత. అలాగే తనను ఎదించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న మస్క్, ఇప్పుడు అమెరికా రాజకీయాలలోని ఈ కొత్త సమీకరణాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ రక్షణ రంగానికి స్పేస్ఎక్స్ అత్యంత కీలకమైన భాగస్వామి కాబట్టి రాత్రికి రాత్రే ఒప్పందాలు రద్దు కాకపోవచ్చు. కానీ వాషింగ్టన్, ఆస్టిన్‌లలో మారిన రాజకీయ పవనాలు మాత్రం మస్క్‌కు రాబోయే రోజుల్లో కఠిన పరీక్ష పెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఎలాన్ మస్క్‌కు, ఈ మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు ఒక పెద్ద గుణపాఠం. ధనబలం ఎంత ఉన్నా, ప్రజాబలం ముందు అది తలవంచక తప్పదని ఈ పరిణామాలు మరోసారి నిరూపించాయి. మరి ఈ రాజకీయ యుద్ధంలో మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటారనేది కాలమే సమాధానం చెప్పాలి!
:- CLN RAJU ( EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
-
ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!