నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట కటువే కానీ మనసు మాత్రం వెన్న అని అందరికి తెలిసిందే. ఇక బయట వేడుకలకు వచ్చినప్పుడు అభిమానులపై బాలయ్య చేయి చేసుకోవడం సాధారణంగా జరిగే ఘటనలే. ఇంకొన్ని చోట్ల రిపోర్టర్లపై కూడా అబలయ్య చిందులు తొక్కినా సందర్భాలు కోకోల్లలు. ఇక తాజాగా మరోసారి రిపోర్టర్ కి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు బాలయ్య. నేడు బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. కరోనా విజృంభిస్తోంది.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలి అంటూ చెప్తుండగా.. ఒక రిపోర్టర్.. సార్.. అది వ్యక్తిగత కాదు సామజిక అని అనడంతో బాలయ్య కోప్పడ్డారు. అది సామాజిక కాదు గాడిద వ్యక్తిగత.. సామజిక ఏంటి అంటూ పంచ్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. బాలయ్యలో చాలా మార్పు వచ్చింది.. నిదానంగా చెప్పాడు.. లేకపోతే చెంప పగిలేది అని కొందరు.. బాలయ్య చేతి దెబ్బ మిస్ అయిపోయాడు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.