Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమా అంటే పంచులు.. ఉండాల్సిందే. ఆయా పంచులు వింటే కొన్ని కొన్నిసార్లు గట్టిగా ఎవరికో కావాలనే వేసినట్లు ఉంటాయి. ముఖ్యంగా బాలయ్య పవర్ పంచులు చూస్తే సినిమాలో విలన్లకు వార్నింగ్ ఇస్తున్నాడో.. బయట ఉన్నవారికి వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు. ఇక తాజాగా వీరసింహ రెడ్డి సినిమాలో కూడా బాలయ్య పొలిటికల్ పంచులు ఎవరికో గట్టిగా తగిలాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ లోనే రెండు డైలాగ్స్.. అయితే ఎవరికో కావాలనే వేసినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారాడు మార్చలేరు’. ఈ డైలాగ్ వినగానే బాలయ్య ఎవరికి వార్నింగ్ ఇచ్చి ఉంటాడో తెలుసా అని అభిమానులు కొట్టేసుకుంటున్నారు.
గతేడాది ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ఘటన పెను వివాదాన్నే సృష్టించింది. నందమూరి కుటుంబం మొత్తం ఆ ఘటనను ఖండించింది. ఇక ఇప్పుడు ఈ డైలాగ్ వారికోసమే బాలయ్య ఏరికోరి రాయించుకొని ఉంటాడని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇక మరో డైలాగ్.. ‘పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఎ కే పొగరు’ అని బాలయ్య పౌరుషంగా చెప్పుకురావడం కూడా హైలైట్ గా నిలిచింది. పవర్ వచ్చాకా కొంతమంది రాజకీయ నేతలు పొగరు చూపిస్తున్నారని బాలయ్య ఒక్క డైలాగ్ తోనే చెప్పుకొచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నది. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన గంటలోనే 1 మిలియన్ వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇక రేపటి నుంచి ఈ డైలాగ్స్ పై పొలిటికల్ హీట్ పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ డైలాగ్ లా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి.