Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మిస్ ఇండియా నుంచి మహేష్ కు భార్యగా మారేవరకు ఆమె జీవితం తెరిచినా పుస్తకమే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నమ్రత, వంశీ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. ఆ ప్రేమ కాస్తా పెళ్ళికి దారితీయడం జరిగిపోయింది. ఇక పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఎన్ని అవకాశాలు వచ్చినా ఆమె సున్నితంగా నో చెప్పింది. కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వలన ఆమె సినిమాలకు దూరంగా ఉంది అనుకున్నారు.. కానీ, మహేష్ వలనే తాను సినిమాలకు దూరం అయ్యినట్లు నమ్రత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
” మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం. పెళ్లి తరువాత నేను గృహిణిలానే ఉండాలని మహేష్ చెప్పాడు..నేను కూడా పెద్ద బంగ్లాలో ఉండను.. మనం వేరే ఇల్లు తీసుకొని ఉండాలి అని కోరాను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లాలలో నివసించడం అంటే చాలా భయం. ఆ కండిషన్ కు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అన్నా.. వెంటనే మహేష్ ఒప్పుకున్నాడ. పెళ్లి చేసుకున్నాం” అని చెప్పుకొచ్చింది. డీల్ అనుకున్నట్లే నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది.. ఇక మహేష్ సైతం ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం నమ్రత ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.