Nagarjuna : ‘బిగ్ బాస్’ తెలుగు రియాల్టీ షో 6వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. నాలుగోసారి నాగ్ ‘బిగ్ బాస్’ హోస్ట్ గా మారాడు. ఇప్పటికే ఈ ఆరవ సీజన్ ప్రోమో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. పోటీదారుల లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి హీరో నాని హోస్ట్ గా వ్యవహరించారు. అయితే మూడవ సీజన్‌లో అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ ని వదలుకోలేక పోతుండగా, నాగ్ ని కాదని వేరే వారిని హోస్ట్ గా ఊహించుకోలేక పోతున్నారు వీక్షకులు. ఒక వేళ షో టైమ్ లో ఏదైనా అత్యవరసరం ఉన్నా కూడా సమంత, రమ్యకృష్ణ వంటి వారు నాగ్ కి ప్రత్యామ్నాయంగా హోస్ట్ గా వ్యవహరించారే తప్ప ఫుల్ ప్లెడ్జ్ హోస్ట్ గా వేరే ఎవరు ఎంట్రీ ఇచ్చే సాహసం చేయలేదు.
ఇదిలా ఉంటే 6వ సీజన్ కి గాను హోస్ట్ గా చేయటానికి నాగార్జున భారీ పారితోషికం అందుకోబోతున్నాడట. సెప్టెంబర్ 4 నుండి ‘బిగ్ బాస్ 6’ ఆరంభం కానుంది. ఇప్పటికే పోటీదారులు క్వారంటైన్ లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. ఇక ఈ షో హోస్ట్ చేయడానికి దాదాపు రూ.15 కోట్లను నాగ్ పారితోషికంగా అందుకోబోతున్నాడట. ఈ సీజన్ లో 15 వారాల పాటు షో ప్రసారం అవుతుందట. అంటే వారానికి కోటి పే చెక్ అందుతుందన్నమాట. గత సీజన్ తో పోలిస్తే ఇది డబుల్ కావటం విశేషం. బిగ్ బాస్ తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్, మోహన్ లాల్, సుదీప్ కి నాగ్ అందుకునే పారితోషికంలో సగం కూడా దక్కటం లేదట. ఇక బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్ కి 350 కోట్ల పారితోషికం దక్కనున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. దానితో పోలిస్తే మన దక్షిణాది స్టార్స్ అందుకునే మొత్తం చాలా చిన్నదే అని చెప్పవచ్చు. సీజన్ సీజన్ కి ‘బిగ్ బాస్’ క్రేజ్ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో తెలుగు సీజన్ 6లో పాల్గొనబోయేది ఎవరన్నది 4వ తేదీన తేలనుంది. ఇక ఈ సీజన్ కి ఎలాంటి క్రేజ్ దక్కుతుందన్నది త్వరలోనే తేలనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.