విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడుగానే పిలుస్తుంటారు. స్టార్‌డమ్‌ను పక్కకు పెట్టి… ఈ ఇద్దరు బయట ఒరిజినల్ బ్రదర్స్‌లాగే పలకరించుకుంటారు. అయితే… ఈ ఇద్దరిలో ఎవరు స్టార్ హీరో అంటే? అసలు ఈ క్వశ్చనే రాంగ్. ఎందుకంటే… వెంకటేష్ సీనియర్ హీరో.. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటే టాలీవుడ్‌ని ఏలాడు కాకపోతే… ఈ మధ్య కాస్త రేసులో వెనబడిపోయాడు. అలా అని వెంకీ సినిమా… చిన్న సినిమా అవుతుందా? అంటే ఛాన్సే లేదు కానీ ఇదే విషయాన్ని ఫ్లోలో చెప్పాడా? లేక తెలిసి చెప్పాడో? తెలియదు గానీ, నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చిన్నోడి పై పెద్దోడి ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేసింది.
సంక్రాంతి రేసులో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ జనవరి 12న రిలీజ్ అవుతుండగా… వెంకటేష్ ‘సైంధవ్’ సినిమా 13న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తున్న నాగవంశీ… ఫ్యాన్స్‌తో ట్విట్టర్ డిస్కషన్ పెట్టాడు. ఈ క్రమంలో… ‘సైంధవ్’ కోసం ఎక్కువ స్క్రీన్స్ బ్లాక్ చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు అభిమానులు. దీనికి నాగవంశీ స్పందిస్తూ… అలాంటిదేమీ లేదు, ఎక్కడ కూడా సమస్యలు రాకుండా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం, సొంత హీరో కాబట్టి… సైంధవ్ కోసం సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్లానింగ్‌కి తాను ఎలా అడ్డుపడగలనని, వాళ్ళ దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా కాబట్టి… సహకరించమని ఎలా అడగ్గలనని… సురేష్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్లి మీ హీరో చిన్న హీరో అని నేను థియేటర్స్ అడగలేను కదా అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. మీ హీరో చిన్న హీరో కదా అన్న నాగ వంశీ మాట ఇప్పుడు దగ్గుబాటి అభిమానులని హర్ట్ చేసింది. దీంతో… నాగవంశీ, సైంధవ్ ఏదో చిన్న సినిమా అని, వెంకటేష్ ని చిన్న హీరో అని అర్థం వచ్చేలా మాట్లాడాడని వెంకీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నాగ వంశీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ వ్యవహారం పై కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా… నాగవంశీ వల్ల వెంకీ, మహేష్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. మరి దీనికి నాగ వంశీ చెక్ పెడతాడేమో చూడాలి.