ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ… రిలీజ్ కి రెడీగా ఉన్న ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏరపడ్డాయి. 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన కాంబినేషన్ 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని మహేష్ బాబు ఇటీవలే కన్ఫర్మ్ చేసాడు. స్వయంగా మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం అనే విషయం చెప్పినా కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఒకటి ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
మహేష్ బాబు సినిమా రిలీజ్ రేస్ లో ఉంటే… ఒకటీ రెండు సినిమాలు, అది కూడా పండగ సీజన్ కాబట్టి రిలీజ్ అవుతాయేమో కానీ లేదంటే మహేష్ సినిమా ఉండగా ఇంకో సినిమా అదే డేట్ కి రిలీజ్ అవ్వడం అనేది జరగని పని. ఇదే విషయాన్నీ నాగ వంశీ కూడా మరోసారి పక్కాగా చెప్పాడు. సంక్రాంతి సినిమాల గురించి గిల్డ్ తో ఏమైనా చర్చించారా అని మీడియా పర్సన్ అడగ్గా… దానికి సమాధానంగా నాగ వంశీ “నేను ఎందుకు అడుగుతాను. సంక్రాంతి సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ గుంటూరు కారం సినిమానే కాబట్టి ముందు వాళ్లు మాట్లాడనివ్వండి. నా సినిమా సంక్రాంతికి వస్తుంది” అని తేల్చి చెప్పేసాడు. ఇంతక ముందు మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా నాగ వంశీ “జనవరి 12 డేట్ ని మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కొందరికి మేము వస్తామో రామో అనే డౌట్ ఉందేమో… మేము కచ్చితంగా వస్తున్నాం. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో లేనంత ఎనర్జీ గుంటూరు కారం సినిమాలో చూస్తారు. మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్ జరగబోతుంది” అని నాగ వంశీ కుండా బద్దలుకొట్టినట్లు… మాతో జాగ్రత్త అనే విషయాన్నీ చెప్పేసాడు.