తెలుగు సినిమా నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన మోడరన్ క్లాసిక్స్ లో జెర్సీ సినిమా టాప్ 3లో తప్పకుండా ఉంటుంది. ఒక అన్ కన్వెన్షనల్ ఎండింగ్ ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా కథని చెప్పి గౌతమ్ తిన్నునూరి మంచి సినిమాని చేసాడు. నాని చాలా న్యాచురల్ గా, ఎమోషనల్ గా పెర్ఫార్మ్ చేసి జెర్సీ సినిమాని స్పెషల్ గా మార్చేసాడు. అనిరుధ్ అయితే జెర్సీ సినిమాకి ప్రాణం పోసాడు. నాని ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ లో చాలా మందికి జెర్సీ సినిమా చాలా స్పెషల్. ఇలాంటి సినిమా కొన్ని సెంటర్స్ లో బయ్యర్స్ కి నష్టాలు తెచ్చింది అనగానే హీరో నాని, ప్రొడ్యూసర్ నాగ వంశీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
హాయ్ నాన్న టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సమయంలో ఒక రిపోర్టర్… “మీరు మంచి సినిమాలు చేస్తున్నారు కానీ బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు. జెర్సీ సినిమా కొన్ని సెంటర్స్ నష్టాలు తెచ్చింది” అని అడిగాడు. దీనికి నాని ఆన్సర్ ఇస్తూ… “ఏ ప్రొడ్యూసర్ నుంచి నా సినిమాకి నష్టాలు అనే మాట రాలేదు. జెర్సీ సినిమాకి పది పెడితే 50 తెచ్చింది. సినిమా బిజినెస్ వెనక చాలా లెక్కలు ఉంటాయి” అని కాస్త గట్టిగానే చెప్పాడు. ఇదే సమయంలో జెర్సీ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ట్వీట్ చేస్తూ… “జెర్సీ సినిమా తన బ్యానర్ నుంచి వచ్చి బెస్ట్ సినిమా. సితారా నుంచి వచ్చిన మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్స్ లో ఒకటి. జెర్సీ సినిమా నేషనల్ వైడ్ గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. క్రియేటివ్ గా కమర్షియల్ గా జెర్సీ సినిమా సాటిస్ఫై చేసింది” అంటూ ట్వీట్ చేసాడు. అయినా జెర్సీ లాంటి సినిమాని డబ్బులతో కొలిచి చూడకూడదు. సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయంలో కొన్నిసార్లు కొలతలు మారుతూ ఉంటాయి.
#JERSEY is one of the most memorable and profitable films made on Sithara Entertainments banner. This film got us national recognition and unending respect. As a Producer, it made me extremely happy both on creative and economic ends.
— Naga Vamsi (@vamsi84) October 15, 2023