12 ఏళ్ళు… ‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వరుడు కావలెను’ వేడుకలో ‘వరుడు’ను గుర్తు చేసిన నాగశౌర్య తన సినిమాకు గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ తో తనకున్న 12 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాగ శౌర్య తనకు, ఈవెంట్ కు ముఖ్య అతిథి అల్లు అర్జున్‌కి మధ్య 12 ఏళ్ల నాటి బంధాన్ని బయటపెట్టాడు.
2009లో తాను తొలిసారి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు డ్యాన్స్ నేర్చుకునేందుకు అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే షెడ్‌కి వెళ్లినట్లు శౌర్య వెల్లడించారు. “బన్నీ అన్నకి ఇది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆయన ‘వరుడు’ సినిమాలో పాట కోసం తన డ్యాన్స్ మూవ్స్ రిహార్సల్ చేస్తున్నాడు. బన్నీ అన్న డెడికేషన్ నన్ను ఆశ్చర్యపరిచింది. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా చెమటలు కక్కుతూ ఎంతో కష్టపడుతున్నాడు. అయితే ఆశ్చర్యం ఎందుకంటే ఆయన మరో చేయి విరిగింది. అయినా సినిమా కోసం ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యాను. మాలాంటి హీరోలందరికీ మీరు స్ఫూర్తిదాయకం” అంటూ అప్పట్లో జరిగిన సంఘటనను వేదికపై గుర్తు చేసుకున్నాడు నాగశౌర్య.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
Read Also : ‘వరుడు కావలెను” వేదికపై ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలు
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ గురించి శౌర్య మాట్లాడుతూ.. ఎవరినైనా బాధపెట్టడం చాలా తేలిక అని, అయితే త్రివిక్రమ్ గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్నారని, అదేమీ అంత ఈజీ కాదని అన్నారు. ఇక చిత్రబృందం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన నాగశౌర్య
“వరుడు కావలెను”తో మరపురాని అనుభూతిని అందించినందుకు తన సహనటులు రీతూ వర్మ, నదియా, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, సంగీత దర్శకులు విశాల్, థమన్, ఎడిటర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ వంశీ, నిర్మాతలు నాగ వంశీ మరియు చిన్నబాబు, మిగతా అందరికి ధన్యవాదాలు తెలిపాడు శౌర్య. ‘వరుడు కావలెను” ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కానుందని, అందరూ థియేటర్లకు వెళ్లి వీక్షించాలని కోరారు.
తాజావార్తలు
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్‌లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!