వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అయింది. తాజాగా ‘తండేల్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ముహూర్త కార్యక్రమానికి సాయి పల్లవి కూడా వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం మరోసారి చై-సాయి పల్లవి కలిశారు. ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే నాగచైతన్య బర్త్ డే గిఫ్ట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా… కర్లీ హెయిర్‌తో, ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించాడు. కొన్ని రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య జాలరిగా కనిపించనున్నాడు. మరి తండేల్‌లో చైతన్య ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.