జీ5లో ప్రసారం అయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమంలో.. గెస్ట్‌గా నటుడు నాగచైతన్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని, వాటి నుంచి పాజిటివ్‌గా నేర్చుకుంటూ ముందుకు వెళితే జీవితం ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే అతను ‘మహానటి’ సినిమాలో ఏఎన్‌ఆర్ తాతయ్య పాత్రకు సంబంధించిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు.
Also Read : The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్‌లో ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్న మారుతి
‘‘నాగ్ అశ్విన్ నాకు ఈ పాత్ర చేయమని చెప్పినప్పటికి, నేను తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఆయన లాగా నటించడం ఎవరికీ సాధ్యం కాదని, గడ్డంతో ఉన్న ‘సవ్యసాచి’ లుక్ సరిపోదని చెప్పి తప్పించుకోవాలనుకున్నా. కానీ, ఒక నెల తర్వాత నాగ్ అశ్విన్ వచ్చి ‘వీఎఫ్ఎక్స్‌లో గడ్డం తీసేస్తాం, నువ్వే నటించాలి’ అని చెప్పాడు. అప్పటికి నేను ఓకే చెప్పాను’’ అని గుర్తుచేశారు. తర్వాత ఆలోచించి.. ‘‘ఒకవేళ నేను చేయకపోతే వేరే నటుడు ఆ పాత్రలో చేస్తాడు. అది నా మనసుకు అంగీకారం కాదు. ఏఎన్నార్‌పై నా ప్రేమను చూపించే అవకాశమిది, నా అదృష్టం’’ అని నాగచైతన్య చెప్పి అభిమానుల హృదయాలను కదిలించారు.