పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై అభిమానుల్లో ఇప్పటికే హైప్ ను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ సినిమా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో జనవరి 9, 2026 న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Also Read : Amitabh Bachchan: గృహిణులమని గర్వంగా చెప్పండి..ఇంటిని చక్కబెట్టడం ఈజీ కాదు
ఈ సినిమా చివరి దశలో ఉండగా.. తాజా సమాచారం యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ అక్కడకు చేరుకుంది. హీరోహీరోయిన్లపై రెండు పాటలను అక్కడే షూట్ చేయడం ప్లాన్ లో ఉన్నారట. ప్రతి షెడ్యూల్ తో పాటు.. ప్రత్యేకంగా యూరప్ షూట్, సినిమాకు అంతర్రాష్ట్ర థ్రిల్ ఇచ్చేలా ప్లాన్ చేయబడిందట. మొత్తనికి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కోసం మారుతి అద్భుతమైన ఎలిమెంట్స్ సిద్ధం చేశాడని తెలుస్తుంది. అభిమానుల కోసం ప్రభాస్ మరోసారి కొత్త స్టెప్ తీస్తున్నాడు, అలాగే మారుతి రేంజ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.