అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మితభాషి, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు, తన పని ఏదో తాను చూసుకోవడం తప్ప వివాదాల జోలికి అస్సలు పోడు. సమంత తో విడాకులు అయినప్పుడు చైతూ ను ట్రోల్స్ చేసినా మౌనంగా ఉండిపోయాడు. ఇక విడాకుల తరువాత కెరీర్ పై దృష్టి పెట్టిన చైతన్య ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొని దూసుకువెళ్తున్నాడు. తాజాగా చైతూ నటించిన థాంక్యూ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో చైతూ సరసన రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగ చైతన్య.. యాంకర్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మూడు పదాలు మాట్లాడాలని యాంకర్ అడుగగా.. మీనింగ్ మాటలు రావని, ఏది మాట్లాడినా స్ట్రైట్ గానే మాట్లాడతానని స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా యాంకర్ నే డబుల్ మీనింగ్ పదాలు మాట్లాడమని రివర్స్ లో షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకు తాను డబుల్ మీనింగ్ పదాలు మాట్లాడలేదని, అవి ఎలా ఉంటాయో కూడా తెలియదని చైతూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కినేని హీరో చాలా నిజాయితీ పరుడని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో చైతూ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.