Naga Chitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా.. వ్యక్తిగతంగా చై గురించిన టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. సమంత తో విడాకుల తరువాత చై, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు గుప్పుమన్నాయి. తెలుగమ్మాయి శోభితా ఇటీవల పొన్నియిన్ సెల్వన్ లో కనిపించి మెప్పించింది. ఈ జంట ముంబైలో కలిసి తిరుగుతున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. అయితే ఈ పుకార్లపై శోభితా స్పందించి.. అవన్నీ పుకార్లే అని చెప్పడంతో ఈ వార్తలకు చెక్ పడింది. అయితే తాజాగా ఈ జంట కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. విదేశాల్లో ఈ జంట ఒక్కటిగా కనిపించి షాక్ ఇచ్చారు.
కోటు, హ్యాట్ తో శోభితా, కోటుతో చై అందంగా కనిపించరు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ఫోటో నిజం కాదు అనేది కొంతమంది నెటిజన్ల వాదన. వారిఇద్దరి ఫోటోలను ఎడిట్ చేసి కలిపారని, అది కొద్దిగా జాగ్రత్తగా చూసినవారందరికి అర్థమవుతోందని అంటున్నారు. లైక్స్ కోసం ఎవరో ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటారని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఫోటో నిజమో కాదో తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే.