మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు

‘మా’ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పోటీదారుల విమర్శలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు నాగబాబు మద్దతుతో మెగా అండదండలు ఉన్నాయి. తాజాగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘మా’ వివాదాలపై ఆయన స్పందించారు.

నాగబాబు మాట్లాడుతూ.. ‘చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్‌రాజ్ కావాలి. ఉత్తమ నటుడిగా ప్రకాష్‌రాజ్‌ను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకు..? తెలుగు నటులు మిగతా భాషల్లో నటించడం లేదా ?ప్రకాష్‌రాజ్ సినిమాకు రూ.కోటి తీసుకునే దమ్మున్నవాడు. ప్రకాష్‌రాజ్ రూ.కోటి వదలుకొని ‘మా’ కోసం వచ్చారు’ అని బాబు తెలిపారు.

మా ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. మా ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.10 వేలు ఇస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతురన్నారట.. మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర చేస్తున్నారు. మా అసోసియేషన్ సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు’ అంటూ నాగబాబు పిలుపునిచ్చారు.

ప్రకాశ్ రాజ్ లాంటి వాడు ఒక్కసారిగా కాదు మూడుసార్లు అధ్యక్షుడిగా ఉండాలన్నారు నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఉంటేనే మా అసోసియేషన్ బాగుపడుతుంది. మా ఎన్నికల్లో మంచివాడ్ని ఎన్నుకుంటే సభ్యులే గెలుస్తారు. ప్రకాశ్ రాజ్ కు మా ఎన్నికల్లో గెలుపు ఓటములు చాలా చిన్న విషయం.. కొంతమంది మంచు విష్ణును గెలిపించాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు మీకెందుకు..? తెలుగు వాళ్ల అందరు కలిసి తెలుగువాణ్ని ఎన్నుకుందామంటే మనోళ్లు వేరే చోట నటించడం లేదా.. కోట శ్రీనివాసరావు తమిళ, కన్నడలో నటించలేదా.. సంకుచిత ఆలోచనల నుంచి తెలుగు నటీనటులు బయటకు రావాలి. ప్రకాశ్ రాజ్ ను గెలిపించేందుకు నూటికి నూరు శాతం శ్రమిస్తాం’ అంటూ నాగబాబు తెలిపారు.

-Advertisement-మంచు విష్ణుకు అంత ఆత్రం ఎందుకు..? ప్రకాష్ రాజే గెలుస్తాడు: నాగబాబు

Related Articles

Latest Articles