కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. తాజాగా గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నడవ్ లాపిడ్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉండాల్సిన సినిమా కాదు, ఆర్టిస్టిక్ కేటగిరిలో అలాంటి సినిమా చూసి షాక్ అయ్యాం. ఈ మాటని బహిరంగంగా చెప్పడానికి ఎలాంటి సంకోచం” లేదంటూ మాట్లాడాడు. ఇజ్రాయిల్ స్క్రీన్ రైటర్ అయిన ‘నాదవ్’ ఎంతోమంది ఇండియన్ మినిస్టర్స్, సినీ సెలబ్రిటీస్ ముందు ‘కాశ్మీర్ ఫైల్స్’ గురించి ఇలా మాట్లాడడం ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇజ్రాయిల్ ప్రముఖులతో పాటు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ఇండియన్ సెలబ్రిటీస్ లో కొంతమంది కూడా ‘కాశ్మీర్ ఫైల్స్’ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ‘నడవ్ లాపిడ్’ని తప్పుబట్టారు. దీంతో ‘నడవ్ లాపిడ్’ ‘నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడుంటే నన్ను క్షమించండి. ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. దర్శకుడు వివేక్ కోపాన్ని అర్ధం చేసుకోగలను’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. క్షమాపణ అయితే కోరాడు కానీ నడవ్ లాపిడ్ ఇప్పటికీ తన మాటని వెనక్కి తీసుకోలేదు. దాడుల్లో ఎఫెక్ట్ అయిన ఏ ఒక్కరినీ బాధ పెట్టాలని తను మాట్లాడలేదని, సినిమా గురించి మాత్రమే తాను మాట్లాడానని… ఈ విషయంలో ఇప్పటికీ అదే మాట పైన ఉంటానని నడవ్ లాపిడ్ తెలిపాడు. “అది అసలు నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు, కాశ్మీర్ ఫైల్స్ ద్వేషాన్ని పెంచేలా ఉంది. హింసని ప్రేరేపించేలా ఉందనేది అందరి అభిప్రాయం” అంటూ నడవ్ లాపిడ్ చెప్పడం కొసమెరుపు.