నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది.ప్రస్తుతం సినిమాలతో పాటు అమ్మడు ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నభా హాట్ హాట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కొత్త ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లూ డెనిమ్ జీన్స్ పై రెడ్ కెల్విన్ క్లైయిన్ బ్రాండ్ బ్రాతో అదరగొట్టేసింది.
కెల్విన్ క్లైయిన్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు దిశా పటానీ. బాలీవుడ్ లో అమ్మడి కెల్విన్ క్లైయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ కి దిశా అయితే.. టాలీవుడ్ కి నభా అని అభిమానులు కామెంట్స్ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్లూ డెనిమ్ విత్ బ్లూ జాకెట్ లో నభా లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.