Murali Mohan: మళ్లీ సినీ నిర్మాణంలోకి మురళీ మోహన్
- ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ ప్రెస్ మీట్
- జయభేరి ఆర్ట్స్ బ్యానర్లో త్వరలో సినీ నిర్మాణం పునఃప్రారంభిస్తా: నటుడు మురళీమోహన్
- భవిష్యత్తులో ‘కమిటీ కుర్రాళ్లు’ లాంటి కొత్త సినిమాలు నిర్మించాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’ సినిమా తర్వాత తాము జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద సినీ నిర్మాణానికి బ్రేక్ ఇచ్చామని, త్వరలో మళ్లీ సినీ నిర్మాణం మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read:Chitrapuri Colony: సినీ డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ లకు చిత్రపురి ఫ్లాట్లు?
Also Read
- Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
- Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు... జోరు మీదున్న రవితేజ
- Maa Inti Bangaaram Day 1 Collections : 'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే కలెక్షన్స్... అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
- OG 2 Update: చేతులు మారిన పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'!
అలాగే, తన సోదరుడి కుమార్తె ప్రియాంక నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, తాము సినీ నిర్మాణం ఆపేసిన అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నిర్మాణంలో కూడా ఎన్నో మార్పులు, చేర్పులు వచ్చాయని వెల్లడించారు. అయితే, ఇప్పుడు చేస్తే ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అని అడిగితే, దానికి ఆయన స్పందిస్తూ, ఇటీవల నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమా చూశానని, ఆ సినిమా చూసిన తర్వాత కొత్త వాళ్లు అయినా బాగా చేశారని అనిపించిందని అన్నారు. ఇక మీదట తాను చేయాలనుకుంటే అలాంటి సినిమాలు చేస్తానని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!