HBD Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు నేడు (ఆగష్టు 9) తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల వయసులోనూ తన అందం, చురుకుదనం, యంగ్ లుక్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్న ప్రిన్స్‌కు, కుటుంబ సభ్యులు, సినీ సహచరులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. హిట్ సినిమాలతో పాటు తన వినయం, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబుకు ఈ ప్రత్యేక రోజున…
ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే దాదాపు రెండు మూడేళ్లు అభిమానులు వారి హీరోను మర్చి పోవాల్సిందే. కానీ ఈ లోగా ఆయన ఫ్యాన్స్‌కి ఓ నాస్టాల్జిక్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మహేష్ పాత క్లాసిక్ హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో…
నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’…