M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
టైటిల్ గురించి ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ — “అగధ అంటే లోతైన అంశం లేదా ఓ శూన్యం అని అర్థం. దేవుడు, దెయ్యం అనే ఫోర్స్ల మధ్య జరిగే కథ ఇది. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఒక దుష్టశక్తిని ఇందులో ‘అగధ’గా చూపించాం. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది కేవలం భయపెట్టే హారర్ సినిమా మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. రియాలిటీకి నా ఫ్యాంటసీ జోడించి ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీశాను” అని తెలిపారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ సినిమా కంటెంట్, టీజర్ చూసి స్టార్ హీరోలు స్పందించిన తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. “టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసేజ్ చేస్తూ ‘ఈసారి కొడుతున్నారు సార్’ అన్నారు. ఇక ప్రభాస్ అయితే ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రశంసించారు. నా హీరోలు, వారి అభిమానులు ఎప్పుడూ నాకు అండగా ఉంటారు” అని వివరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..