Mrunal Thakur: సీతారామం చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకొంది మృణాల్ ఠాకూర్. తీరైన చీరకట్టు, నుదుటిన బొట్టు, కలలో కూడా కవ్వించే కాటుక కళ్లతో అచ్చతెలుగు సీతామహాలక్ష్మీలా కనిపించిన మృణాల్ పై టాలీవుడ్ అభిమానులు మనసు పారేసుకున్నారు. సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన మృణాల్.. తగిన అవకాశం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసింది. ఇక అందరు బాలీవుడ్ హీరోయిన్స్ లానే అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడింది. ఇక హిందీలో సూపర్ 30 సినిమా అమ్మడికి మంచి పేరును తీసుకురాగా.. తెలుగులో సీతారామం స్టార్ స్టేటస్ ను అందించింది.
ఇక ఈ సినిమా తరువాత తెలుగు అభిమానులు మృణాల్ ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అందులో అంతకు ముందు మృణాల్ హాట్ ఫోటో షూట్స్ ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా మృణాల్ అర్ధనగ్నంగా దిగిన ఫొటోస్ పై అభిమానులు కాసింత ఎక్కువే విరుచుకుపడుతున్నారు. ఏంటి మృణాల్.. నేను మేము సీత గా ఉహించుకొంటుంటే.. నువ్వు ఇలా ఉన్నావ్ అని కొందరు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వెయ్యి మృణాల్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మృణాల్ అర్ధనగ్న ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ముందు ముందు ఈ సీత ఎలాంటి సినిమాలలో కనిపించనుందో చూడాలి.