ఆసక్తి రేపుతున్న ‘థ్యాంక్యూ బ్రదర్స్’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గర్భవతి అయిన ఓ మహిళ. జీవితం పట్ల బాధ్యత లేని ఓ కుర్రాడు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దాని పర్యవసానమే ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల తెలుగులో బాగానే వస్తున్నాయి. వాటికి చక్కని ఆదరణ కూడా లభిస్తోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నమైన సినిమా ఇదని 1.27 నిమిషాల ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, పెర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలూ ఇప్పటికే కొన్ని సినిమాలలో చేసి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఇది అదే కోవకు చెందిన చిత్రంగా కనిపిస్తోంది. ఇక విరాజ్ అశ్విన్ కొన్ని సినిమాలలో నటించినా, తనదైన గుర్తింపును ఇంకా పొందలేదు. ఆ లోటును ఈ సినిమా తీర్చుతుందనిపిస్తోంది. ఇతర ప్రధాన పాత్రాలలో ‘కార్తీక దీపం’ ఫేమ్ అర్చనా అనంత్, అనీశ్ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, హర్ష నటించారు. ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆహా’ ద్వారా మే 7న విడుదల చేస్తున్నారు. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ మూవీకి రమేశ్ రాపప్తి దర్శకత్వం వహించాడు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూర్చాడు.
Also Read
తాజావార్తలు
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!