యాంకర్ అనసూయ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఆమె ప్రధానపాత్రలో ‘థ్యాంక్యూ బ్రదర్’ నటించింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ‘ఆహా’ సంస్థ విడుదల చేసింది. లాక్‌డౌన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చిత్రీకరించారనే…
గర్భవతి అయిన ఓ మహిళ. జీవితం పట్ల బాధ్యత లేని ఓ కుర్రాడు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దాని పర్యవసానమే ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల తెలుగులో బాగానే వస్తున్నాయి. వాటికి చక్కని ఆదరణ కూడా లభిస్తోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నమైన సినిమా ఇదని 1.27 నిమిషాల ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, పెర్ఫార్మెన్స్…